సౌత్ సినిమాపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు.!

- September 26, 2023 , by Maagulf
సౌత్ సినిమాపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు.!

కంగనా రనౌత్ అంటేనే ఫైర్ బ్రాండ్. ఆమె నోటి వెంట ఏ మాట వచ్చినా అదో సంచలనమే. తాజాగా కంగనా రనౌత్ నటించిన సినిమా ‘చంద్రముఖి 2’. లాంగ్ గ్యాప్ తర్వాత సౌత్‌లో కంగనా నటిస్తున్న చిత్రమిది. 

అప్పుడెప్పుడో ప్రబాస్ సరసన ‘ఏక్ నిరంజన్’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కంగనా రనౌత్. ఆ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదామె. మళ్లీ ‘చంద్రముఖి 2’ సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకుకు డిఫరెంట్ ట్రీట్ ఇవ్వబోతోంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు తెలుగు మీడియా చానెళ్లకు ఆమె ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇంటర్వ్యూలకు చాలా డిగ్నిఫైడ్‌గా హాజరవుతోందామె. నిండైన చీరకట్టులో పద్దతిగా, ఒద్దికగా కనిపిస్తోంది.

ఎప్పుడూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసే కంగనా రనౌత్ ఈ సారి చాలా జాగ్రత్తగా మాట్లాడుతోంది. సౌత్ సినిమా, నార్త్ సినిమా అనే దాంట్లో మీ అభిప్రాయమేంటని విలేఖరి అడిగిన ప్రశ్నకు కంగనా ఇచ్చిన సమాధానం సౌత్ ప్రేక్షకులకు ఆమెను మరింత దగ్గర చేసేలా వుంది.

సౌత్ సినిమా.. నార్త్ సినిమా అనే తేడాల్లేవ్. సినిమా అంతా ఒక్కటే. ఇండియన్ సినిమా.! అని ఎంతో హుందాగా కంగనా రనౌత్ సమాధానమిచ్చింది. ఈ నెల 28న ‘చంద్రముఖి 2’ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.

లారెన్స్ రాఘవ మేల్ లీడ్ పోషిస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది కంగనా రనౌత్. పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com