సౌదీ-యెమెన్ సరిహద్దులో డ్రోన్ దాడి.. ఇద్దరు బహ్రెయిన్ సైనికులు మృతి
- September 26, 2023
యూఏఈ: యెమెన్-సౌదీ సరిహద్దులో పెట్రోలింగ్ చేస్తున్నక్రమంలో హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన డ్రోన్ దాడిలో తమ అధికారి, సైనికుడు మరణించినట్లు బహ్రెయిన్ సైనిక కమాండ్ తెలిపింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో పలువురు సైనికులు గాయపడ్డారని సైన్యం పేర్కొంది. సోదర సౌదీ అరేబియా దక్షిణ సరిహద్దులను రక్షించడానికి విధుల్లో ఉండగా ఈ ఘటన జరిగిందని, ఇందులో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారని బహ్రెయిన్ సైనిక కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్ అమరవీరుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం