‘స్కంధ’ విషయంలో ఆ ప్రచారం నిజమేనా.?

- September 26, 2023 , by Maagulf
‘స్కంధ’ విషయంలో ఆ ప్రచారం నిజమేనా.?

రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘స్కంధ’. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ఇది. రామ్ కెరీర్‌లో తొలి ప్యాన్ ఇండియా సినిమాగా ‘స్కంధ’ రిలీజ్ అవుతోంది.

అయితే, ‘స్కంధ’కి అంత సీనుందా.? అంటే భిన్న వాదనలు వినిపిస్తున్నాయ్. ‘అఖండ’ సినిమాతో బోయపాటి శీను అఖండమైన విజయమే అందుకున్నారు. అందులో నో డౌట్. కానీ, ‘స్కంధ’ విషయంలో జరుగుతున్న ప్రచారానికీ, చూపిస్తున్న పబ్లిసిటీ హడావిడికీ ఏమాత్రం సంబంధం లేదు.

పెయిడ్ ప్రమోషన్లతో ఊదరగొడుతున్నారట. ఎంత చేసినా ఎందుకో కానీ, ఈ సినిమాపై ఆర్గానిక్ బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు. 

ఓ వైపు క్రేజీ హీరోయిన్ శ్రీలీల గ్లామర్ ఈ సినిమాకి అదనంగా వున్నప్పటికీ, బోయపాటి రేంజ్ మాస్ అప్పీల్‌ని రామ్‌లో చూపిస్తున్నప్పటికీ అస్సలు బజ్ క్రియేట్ కావడం లేదు.

థమన్ అందించిన పాటలు జస్ట్ ఓకే అనేలా వున్నాయ్. లేటెస్ట్‌గా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫుల్ ఆఫ్ మాస్ కంటెంట్‌తో ట్రైలర్ నింపేశారు. రామ్ ర్యాపో లుక్స్.. మాస్ లుక్స్.. డైలాగ్స్ అన్నీ ఓకే కానీ, సినిమాని ఎలా అంచనా వేయాలో అన్న విషయంపై చిన్న కన్ృప్యూజన్. చూడాలి మరి, మరికొద్ది రోజుల్లోనే ఈ కన్‌ఫ్యూజన్‌కి తెర పడిపోనుంది. ఈ నెల 28న ‘స్కంధ’ రిలీజ్ కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com