పచ్చి ఉల్లిపాయలు (స్ప్రింగ్ ఆనియన్) తింటున్నారా.?

- September 26, 2023 , by Maagulf
పచ్చి ఉల్లిపాయలు (స్ప్రింగ్ ఆనియన్) తింటున్నారా.?

ఉల్లిపాయలు లేకుండా ఏ కూర వండలేం. ప్రతీరోజూ ఉపయోగించే కూరల్లో ఉల్లిపాయలది అత్యంత కీలక స్థానం. అయితే, స్ప్రింగ్ ఆనియన్స్ అని పిలవబడే పచ్చి ఉల్లిపాయలును చాలా తక్కువగా మాత్రమే యూజ్ చేస్తుంటారు.

రెస్టారెంట్ ఫుడ్స్‌లో ఎక్కువగా చూస్తుంటాం. అలాగే, ప్రైడ్ రైస్.. సలాడ్స్ వంటి వాటిలోనూ వీటిని విరివిగా వాడుతుంటారు. కానీ, ఇంటి వంటకాల్లో ఎంతమంది వీటిని యూజ్ చేస్తున్నారు.? 

చాలా తక్కువ మంది అన్న సమాధానమే వస్తుంది. కానీ, ఇంటి వంటకాల్లోనూ రెగ్యులర్‌గా వీటిని యూజ్ చేయాల్సిన అవసరం వుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు కారణం ఈ స్ప్రింగ్ ఆనియన్స్‌లో వున్న పోషకాలే. 

అవి ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తాయట. ధమనుల పని తీరును మెరుగు పరచడంలో స్ర్పింగ్ ఆనియన్స్ కీలక పాత్ర పోషిస్తాయట. తద్వారా రక్త పోటు రాకుండా వుంటుంది. గుండె పొరల్లో బ్లాకులు ఏర్పడకుండా వుంటాయ్. సో, స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువగా తినే వారిలో గుండె పోటు ముప్పు చాలా తక్కువట. 

అలాగే, ఫైబర్ అధికంగా వుండే ఫుడ్ ఐటెమ్స్‌లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఒకటి. ఇవి ఆకుకూరల జాబితాలోకీ వస్తాయ్. అందుకే వీటిని విరివిగా వాడమని వైద్యులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com