షార్జాలో ఉచిత పబ్లిక్ పార్కింగ్
- September 28, 2023
షార్జా: షార్జా మున్సిపాలిటీ రాబోయే సెలవుదినం కోసం ఉచిత పబ్లిక్ పార్కింగ్ ను ప్రకటించింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పుట్టినరోజు సందర్భంగా షార్జాలోని నివాసితులకు సెప్టెంబర్ 28న పార్కింగ్ ఫీజు నుండి మినహాయింపు ఉంటుందని అధికారులు బుధవారం తెలిపారు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సెప్టెంబర్ 28 నుండి వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు. షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు 3-రోజుల వారాంతపు సెలవు (శుక్రవారం నుండి ఆదివారం వరకు) ఉండటంతో.. వారికి సెలవులు నాలుగు రోజుల వీకెండ్ రానుంది. అక్టోబరు 2వ తేదీ సోమవారం నుంచి ఉద్యోగులు విధుల్లో చేరనున్నారు. కాగా, ఉచిత పార్కింగ్ గురువారం, శుక్రవారాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. తదుపరి రెండు రోజుల సెలవులకు ఛార్జీలు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







