ట్యాంక్ బండ్ కు చేరుకున్న మహాగణపతి

- September 28, 2023 , by Maagulf
ట్యాంక్ బండ్ కు చేరుకున్న మహాగణపతి

హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి ట్యాంక్ బండ్ కు చేరుకుంది..మరికాసేపట్లో క్రేన్ నంబర్.4 వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు నిర్వాహకులు. అనంతరం మహగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నారు. హైదరాబాద్‌లో గణేష్‌ మహా శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. నిమజ్జనానికి రాత్రి నుంచే గణనాథులు తరలివస్తున్నారు. దీంతో ట్యాంక్‌బండ్‌పై సందడి మొదలైపోయింది.

గణేష్‌ మహా శోభాయాత్ర నేపపథ్యంలో వినాయక నిమజ్జనాలకు జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈరోజు 50 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ట్యాంక్‌బండ్‌తో పాటు పలు చెరువులు, రబ్బర్‌ డ్యామ్స్‌, బేబీ పాండ్స్‌లో నిమజ్జనాలు జరగనున్నాయి. హుస్సేన్‌సాగర్ చుట్టూ 5 చోట్ల 36 భారీ క్రేన్లను మోహరించారు. ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ, భద్రతా బలగాలతో పకడ్బంధీగా చర్యలు తీసుకున్నారు. 20వేల సీసీకెమెరాలతో పటిష్ట నిఘా.. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో..25,694 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com