పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రకు సంపూర్ణ మద్దతు: బాలకృష్ణ
- September 30, 2023
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. తప్పుడు కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని అన్నారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్లో ఈరోజు టిడిపి యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాలకృష్ణతో పాటు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







