ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు
- October 01, 2023
ఫిలడెల్ఫియా: సెప్టెంబర్:30 అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఫిలడెల్ఫియాలో గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఫిలడెల్ఫియాలోని స్థానిక భారతీయ టెంపుల్‌లో గణేశ్ ఉత్సవాల్లోనాట్స్ నేనుసైతం అంటూ పాల్గొని 1000 మందికి మహా ప్రసాదం పేరుతో భోజనాలు ఏర్పాటు చేసింది. నాట్స్ సభ్యులంతా కుటుంబసమేతంగా ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేశారు. ఇందులో ముఖ్యంగా దీప్తి, రామకృష్ణ గొర్రెపాటి, భార్గవి, రమణ రాకోతు, సునీత, లవ ఇనంపూడి, దీప, పార్ధ మాదల, కవిత. ప్రకాష్ కురుకుండ, అంజు, విజయ్ వేమగిరి, దీక్ష, మధు కొల్లి, కమలజ, నిరంజన్ యనమండ్ర, మాలిని, శ్రీనివాస్ గట్టు, రాజ్యలక్ష్మి, సురేంద్ర కొరిటాల, బిందు, బాబు మేడి, సునీత, మధు బుదాటి, లావణ్య, సురేష్ బొందుగుల, కమల, రామ్ కొమ్మనబోయిన, సునీత, ప్రశాంత్ పసుపుల, అను, శ్రీనివాస్ దొంతినేని, భావన, రఘు సిరగవరపు, కవిత సతీష్ పుల్యపూడి, నీలిమ సుధాకర్ ఓలేటి, రాధిక మరియు హరి బుంగాటవుల, సుధ, శ్రీధర్ అప్పసాని తదితరులు కీలక పాత్ర పోషించారు. నాట్స్ ఫిలడెల్ఫియా చాప్టర్ నాయకులంతా ఈ మహాప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందించారు. ఫిలడెల్ఫియాలో తెలుగువారిని ఒక్కటి చేసేలా నాట్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంపై నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి నాట్స్ ఫిలడెల్ఫియా నాయకులను ప్రశంసించారు. పండుగల సమయంలో తెలుగువారి ఐక్యత చాటేలా మహాప్రసాదం కార్యక్రమం చేపట్టిన ఫిలడెల్ఫియా నాట్స్ విభాగాన్ని నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు)నూతి ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్‌లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!
- తెలంగాణ భవన్ వద్ద కలకలం..
- సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చిన ప్రధాని మోదీ
- ప్రవాసాంధ్రుల అభ్యున్నతే ఏపీ ఎన్నార్టీ ధ్యేయం: మంత్రి శ్రీనివాస్