సౌదీలో వృద్ధుడిని 23 మిలియన్ల మేర మోసం చేసిన ముఠా
- October 02, 2023
రియాద్: సౌదీ అరేబియాలో ఆర్థిక మోసం, ఫోర్జరీ, మనీ లాండరింగ్ మరియు మరిన్ని ఆరోపణలపై ఏడుగురు పౌరుల బృందాన్ని అరెస్టు చేశారు. సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) ప్రకారం.. క్రిమినల్ ఆర్గనైజేషన్‌లో ఒక వ్యక్తి లాయర్‌గా, అలాగే మహిళా న్యాయవాది, ప్రభుత్వ ఉద్యోగి, టెలికాం కంపెనీ ఉద్యోగి, రియల్ ఎస్టేట్ ఉద్యోగి వలె నటించి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వృద్ధుడిని మోసం చేశారు. లాయర్‌గా నటించే వ్యక్తికి వృద్ధుడి గురించి, అతని ఆర్థిక వ్యవహారాలు మరియు అతని ఆరోగ్యం క్షీణించడం గురించి అవగాహన ఉంది. దీంతో బాధితుడి పేరుతో నకిలీ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి, టెలికాం కంపెనీ ఉద్యోగి బాధితుడి పేరు మీద ప్రభుత్వ సేవలు, సిమ్ కార్డును పొందడంలో సహాయం చేసారు. రియల్ ఎస్టేట్ కంపెనీ ఉద్యోగి కూడా తప్పుడు క్లెయిమ్‌లను ఫైల్ చేయడంలో సహాయం చేసాడు. నిందితుల విచారణ తర్వాత అధికారులు SR 23 మిలియన్లను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







