నిత్యా మీనన్ అలా డిసైడ్ అయ్యిందా.?
- October 02, 2023
హీరోయిన్ల యందు నిత్యా మీనన్ వేరయా.! అంటే అతిశయోక్తి కాదేమో. అవును నిత్యా మీనన్ సినిమాకి సైన్ చేసిందంటే.. ఖచ్చితంగా ఆ సినిమాలో విషయముంటుంది. అలాగే ఆమె పాత్రలోనూ ఏదో కొత్తదనం వుంటుంది.. అనే అభిప్రాయాలుంటాయ్.
అందుకే గ్లామర్‌తో పని లేకుండా ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి భార్యగా నటించింది ఇటీవల నిత్యా మీనన్. తాజాగా ఓటీటీలో ప్రత్యక్షమైంది ‘కుమారి శ్రీమతి’గా. అవునండీ ఆమె నటించిన వెబ్ సిరీస్ పేరే ‘కుమారి శ్రీమతి’.
పల్లెటూరి అందాలకు అద్దం పడుతూ, తన తాతల ఆస్థిని కాపాడుకునేందుకు ఓ ఆడపిల్ల పడే తపన, తాపత్రయం ఈ సిరీస్‌లో శ్రీమతి పాత్ర ద్వారా నిత్యా మీనన్ చూపించింది.
క్యూట్‌గా వుంటుంది కదా.. ఆమెకు ఈ పాత్ర కూడా అంతే క్యూట్‌గా సెట్టయిపోయింది. డైలాగులు బాగున్నాయ్. సినిమాటోగ్రఫీ ఆహ్లాదంగా వుంది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో ‘కుమారి శ్రీమతి’ ఓటీటీ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది.
అన్నట్లు ఈ సిరీస్‌లో బుల్లితెర హీరో శ్రీరామ్ పరిటాల అదేనండీ డాక్టర్ బాబు ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించాడు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







