రస్ అల్ ఖైమాకి 8 కొత్త డ్యామ్‌లు
- May 21, 2016
ఎమిరేట్ ఆఫ్ రస్ అల్‌ఖైమా వాది హకీల్ వద్ద ఎనిమిది కొత్త డ్యామ్‌లతో నీటి కొరతను తీర్చుకోనుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించారు. ముందుగా సమీపంలో ఉన్న స్థానికులకు మౌంటెయిన్స్ నుంచి వచ్చే నీటిని వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. మినిస్ట్రీ ఇప్పటికే ఎనిమిది డ్యామ్‌లకు సంబంధించిన డిజైన్ వర్క్స్ పూర్తి చేసిందని వాడి హకీల్ వద్ద వీటిని నిర్మించనున్నారని, షార్జాలోని కల్బాలోగల వాడి అల్ హెల్వ్ వద్ద మరో మూడు డ్యామ్‌లను నిర్మించనుందని మినిస్ట్రీకి చెందిన అధికారి ఒకరు వివరించారు. వాడి హకీల్కి చెందిన స్థానికుడొకరు, డ్యామ్‌ల కారణంగా వరదల నుంచి తమకు విముక్తి లభిస్తుందనీ, అలాగే నీటి సమస్య తీరుతుందని అన్నారు. రస్ అల్ ఖైమాకి ముందుగా 94 మిలియన్ గ్యాలర్ల వర్షపు నీటిని డ్యాముల్లో స్టోర్ చేయవచ్చునని అధికారిక వర్గాలు వెల్లడించాయి. రస్ అల్ ఖైమా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, చిన్న చిన్న బ్రిడ్జ్‌లను షాకా అల్ జెజి రోడ్లో నిర్మించి, డ్రైన్ వాటర్‌ని సంరక్షించనున్నట్లు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్‌పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్‌కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్‌లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!
- సినావ్లో అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు..!!
- 2026–2027కు స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించిన ఖతార్..!!
- యాత్రికులకు అత్యున్నత నాణ్యత గల సేవలు..!!
- సీఎం చంద్రబాబు విజన్ ను విశ్వవ్యాప్తం చేయవలసిన బాద్యత రచయుతలదే: మంత్రి పార్థసారధి
- నావికా దళ నిషేధం ఎత్తివేసిన తర్వాతే చర్చలు: ఇరాన్









