ఈ ఎమిరేట్‌లో జనవరి 1నుండి ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం

- October 05, 2023 , by Maagulf
ఈ ఎమిరేట్‌లో జనవరి 1నుండి ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం

యూఏఈ: జనవరి 1, 2024 నుండి రస్ అల్ ఖైమాలో ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ సంచులను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. ఎమిరేట్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎప్డా) బుధవారం కొత్త చట్టాన్ని వివరించింది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లపై పాన్-యుఎఇ బ్లాంకెట్ బ్యాన్‌కు అనుగుణంగా వస్తుందని తెలిపింది. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రస్ అల్ ఖైమా పాలకుడు హిస్ హైనెస్ షేక్ సౌద్ బిన్ సకర్ అల్ ఖాసిమి జారీ చేసిన 2023 చట్టం నెం.4 ప్రకారం ఈ ప్లాస్టిక్‌ల వినియాగాన్ని వచ్చే ఏడాది నుండి ఎమిరేట్‌లో నిషేధించబడతాయి.   అబుదాబిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లపై నిషేధం జూన్ 1, 2022 నుండి అమల్లోకి వచ్చింది.దుబాయ్‌లో జూలై 1, 2022 నుండి, షార్జా అక్టోబర్ 1, 2022 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్‌లకు 25-ఫిల్ టారిఫ్‌ను ప్రవేశపెట్టింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com