జార్జికారనేషన్‌ హైస్కూల్‌ విద్యార్థుల అపూర్వ కలయిక

- October 07, 2023 , by Maagulf
జార్జికారనేషన్‌ హైస్కూల్‌ విద్యార్థుల అపూర్వ కలయిక

మచిలీపట్నం: మచిలీపట్నం జార్జికారనేషన్‌ హైస్కూల్‌కు చెందిన 1990-91 బ్యాచ్ విద్యార్థిని విద్యార్థుల అపూర్వ కలయిక జరిగింది. 33 సంవత్సరాల తర్వాత చిన్ననాటి  బాల్య స్నేహితులు గెట్‌టు గెదర్‌ కార్యక్రమంతో కలవడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథులుగా 30-33 సంవత్సరాల క్రితం జార్జికారనేషన్‌ స్కూల్లో తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను ఈ  అపూర్వ కలయిక కు వారిని  ఆహ్వానించి వారికి గౌరవ సత్కారం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రము నలుమూలల నుంచి విదార్థులు వచ్చారు. ముఖ్యంగా ఈ జార్జికారనేషన్‌ హైస్కూల్‌  విద్యార్థుల అపూర్వ కలయిక  కార్యక్రమం రూపకల్పనలో బి ఉదయ  పి ప్రసాద్, మురళి, కిరణ్మయి సహకరించి జార్జికారనేషన్‌ హైస్కూల్‌  విద్యార్థుల అపూర్వ కలయిక  విజయవంతం అయ్యేలా కృషి చేశారు.

డైరెక్టర్ మారుతి కూడా పూర్వ విద్యార్ధే.. 
జార్జికారనేషన్‌ హైస్కూల్‌  విద్యార్థుల అపూర్వ కలయిక కు ఒక ప్రత్యేకత నెలకొంది.మొత్తం మీద 1990-91 బ్యాచ్ కి చెందిన 100 మంది విద్యార్థిని విద్యార్థులు జార్జికారనేషన్‌ హైస్కూల్‌  విద్యార్థుల అపూర్వ కలయిక కు హాజరయ్యారు. జార్జికారనేషన్‌ హైస్కూల్‌ లో చదివి సినీ పరిశ్రమకు వెళ్లి డైరెక్టర్ గ మారిన మారుతి కూడా  1990-91 బ్యాచ్ కి చెందిన విద్యార్ధే కావడం గమనార్హం. దీంతో  జార్జికారనేషన్‌ హైస్కూల్‌  విద్యార్థుల అపూర్వ కలయిక కు సినీ డైరెక్టర్ మారుతి కూడా రావడం మరింత ఆకర్షణ తోడైనట్లు అయ్యింది. ఈ అపూర్వ కార్యక్రమానికి రావడంతో  పాటు ఆద్యంతం హుషారుగా అందరితో కలిసిపోయి ఎంజాయ్ చేయడం అందరిని ఆకర్షించింది. సినీ డైరెక్టర్ అయినా తాను మీ లో ఒక్కడినే అనే భావనలో అందరితో మారుతి వ్యవహరించడం చిన్న నాటి మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. 


ఎవరినైనా మర్చిపోతామేమో కానీ..చిన్ననాటి స్నేహితుల్ని కాదు.. : డైరెక్టర్‌ మారుతి
‘‘బాల్యం నుంచి ప్రతి దశలోనూ మన జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు. కాలక్రమంలో అందులో కొందరిని మనం మర్చిపోవడం సహజం. కానీ జీవితపు తొలి దశలో ప్రేమాభిమానాలు కురిపించే బాల్య స్నేహితులను మాత్రం కాదు’’ అన్నారు యువ దర్శకులు మారుతి.

 పాటు, స్వయంకృషితో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న తమ చిన్ననాటి స్నేహితుడు మారుతిని ప్రేమగా సత్కరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్‌గా క్షణం తీరిక లేకుండా ఉన్న ఆయన ఈ కార్యక్రమానికి విచ్చేసి దాదాపు 4 గంటల పాటు చిన్ననాటి స్నేహితులను పేరు పేరునా పలకరించి, వారితో గడపడం విశేషం.  ఈ సందర్భంగా తన చిన్ననాటి సంఘటనలను, తాను కష్టపడి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగిన విధానాన్ని వివరించడంతో పాటు, తన స్నేహితులు ఎవరెవరు ఏఏ రంగాల్లో ఉన్నారు. వారు కూడా జీవితంలో ఎదగటానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించి, సన్మానపత్రం కూడా అందజేశారు.
‘ఈరోజుల్లో..’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటి.. ‘బస్టాప్‌’, ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘బాబు బంగారం’, ‘కొత్త జంట’. ‘ప్రతిరోజూ పండగే’ ‘మహానుభావుడు’, ‘పక్కా కమర్షియల్‌’ ఇలా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు మారుతి. ప్రస్తుతం ఆయన ఇండియన్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ఓ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఘన విజయం సాధించి తమ స్నేహితుడు మారుతి కూడా ఇండియన్‌ మోస్ట్‌ వాంటెడ్‌  డైరెక్టర్‌గా ఎదగాలని ఆయన స్నేహితులు ముక్త కంఠంతో కోరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com