కొత్త లుక్‌లో ఎయిర్ ఇండియా విమానాలు
- October 07, 2023
న్యూ ఢిల్లీ: ఎయిరిండియా విమానాలు సరికొత్త లుక్ లో కనిపించనున్నాయి. సరికొత్తగా రూపుదిద్దుకున్న విమానాలను సంస్థ విడుదల చేసింది. ఎయిరిండియాను టాటా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన తరువాత సంస్థ విమానాల వివిధ మార్పులకు శ్రీకారం చుడుతోంది టాటా గ్రూప. దీంట్లో భాగంగా సరికొత్త లుక్ లోకి మారిన విమానాల ఫోటోలను ట్విట్టర్ వేదికగా శనివారం (అక్టోబర్ 7,2023)తాజాగా విడుదల చేసిది. సంస్థ లోగో ఎయిర్‌క్రాఫ్ట్ లివరీ (విమానాల రూపు)లో మార్పులు చేసింది. ఫ్రాన్స్ లోని టౌలోసి వర్క్ షాప్ లో కొత్త లోగో, సరికొత్త డిజైన్తో ముస్తామైన A350 విమానం ఫొటోలను ఎయిరిండియా ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ఆగస్టులో ఎయిర్ ఇండియా తన కొత్త లోగోను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఎయిర్ లైన్ కొత్త లోగోపై టాటా యాజమాన్యం 15 నెలల పాటు పనిచేసింది. దీనికోసం సొంతంగా ‘ఎయిర్ ఇండియా శాన్స్’ ఫాంట్‌ను డిజైన్ చేశారు. లోగోలో ఎయిరిండియా ఫాంట్‌ను కూడా మార్చారని ఈ ఫోటోలు చూస్తే తెలుస్తోంది. అలాగే ఎరుపు, ఊదారంగు వంటి సరికొత్త డిజైన్‌లతో విమానాలు కనువిందుగా కనిపిస్తున్నాయి. సంస్థకు గత వైభవాన్ని తెచ్చేందుకు చేస్తున్న ప్లాన్ లో భాగంగా ఈ మార్పులు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సరికొత్త లుక్ లో ఉన్న విమానాలు వచ్చే నవంబర్ లేదా డిసెంబర్ నాటికి సర్వీసులు ఇవ్వనున్నట్లుగా సమాచారం. 2025 నాటికి ఎయిరిండియాలోని అన్ని విమానాలను కొత్త లోగోలోకి మార్చనున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అలాగే 2026 చివరినాటికి ఎయిర్ ఇండియా పూర్తిగా సుదూర విమానాలను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ఎయిర్ ిండియా వెబ్ సైట్,మొబైల్ యాప్, లాయల్టీ ప్రోగ్రామ్, రీపిటెడ్ ఇంటీరియల్ ను దశలవారీగా ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
Here's the first look of the majestic A350 in our new livery at the paint shop in Toulouse. Our A350s start coming home this winter... @Airbus #FlyAI #AirIndia #NewFleet #Airbus350 pic.twitter.com/nGe3hIExsx
— Air India (@airindia) October 6, 2023
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







