కువైట్: చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ సర్వమత ప్రార్దనలు..
- October 07, 2023
కువైట్ సిటీ: ఎన్నారై తెలుగుదేశం కువైట్ మరియు జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన త్వరగా కడిగిన ముత్యంలాగా విడుదల కావాలని సర్వమత ప్రార్దనలు చేశారు.
ఫర్వానియ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ముస్లిం ఆచారం ప్రకారం నమాజు చేసి తరువాత క్రిస్టియన్ ఆచారం ప్రకారం బైబిల్ లోని కొన్ని వాక్యాలను చదివి ప్రార్దనలు చేశారు.చివరగా హిందూ ఆచారం ప్రకారం కలియుగ దైవం వెంకన్న తండ్రిని గోవింద నామాలతో స్తుతించి చంద్రబాబు క్షేమంగా త్వరగా విడుదల కావాలని ప్రార్దించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కుదరవల్లి సుధాకర రావు, అక్కిలి నాగేంద్ర బాబు, మద్దిన ఈశ్వర్ నాయుడు, దుగ్గి శ్రీనివాస్. కొల్లి ఆంజనేయులు, మద్దిపట్ల శివ, నరేష్. పెంచల్ నాయుడు, సుంకేసుల అన్వర్, గాజులపల్లి సుబ్బా రెడ్డి, శివారెడ్డి, మహాసేన రాజేష్ రాపాక, సుబ్బరాజు, షేక్ రసూల్, ఖాదర్ వల్లి, గల్లా శ్రీనివాసులు, పూజుల శివ, మొదలగువారు మరియు జనసేన నాయకులు రామచంద్ర నాయక్, పగడాల అంజన్ కుమార్. శివ తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!







