బిజెపిలో చేరిన చికోటి ప్రవీణ్
- October 07, 2023
హైదరాబాద్: కాసినో వ్యవహారాలు, ఫామ్ హౌస్ లో చిత్రవిచిత్రమైన జంతువుల పెంపకం తదితర అంశాలతో గుర్తింపు తెచ్చుకున్న చికోటి ప్రవీణ్ నేడు బిజెపిలో చేరారు. చికోటి ప్రవీణ్ బిజెపిలో చేరే అంశం చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. బిజెపి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ బిజెపిలో అతడికి సభ్యత్వం అందించారు.
ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామ్ చందర్ రావు తదితరుల సమక్షంలో చికోటి ప్రవీణ్ బిజెపి తీర్థం పుచుకున్నారు. బిజెపి నేతలు చికోటి ప్రవీణ్ కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బిజెపిలో చేరిన అనంతరం చికోటి ప్రవీణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరునాళ్లలో దారితప్పిన పిల్లవాడు తిరిగి తల్లి ఒడికి చేరినట్టుగా ఉందని పేర్కొన్నారు. కొన్నాళ్ల కిందటే బిజెపిలో చేరాల్సి ఉన్నప్పటికీ, కొంత సమాచార లోపం వల్ల చేరలేకపోయానని, ఇన్నాళ్లకు బిజెపిలోకి రావడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. బిజెపిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







