రామ్ సరసన ఆ బాలీవుడ్ హీరోయిన్.? పూరీ మామూలోడు కాదు.!

- October 09, 2023 , by Maagulf
రామ్ సరసన ఆ బాలీవుడ్ హీరోయిన్.? పూరీ మామూలోడు కాదు.!

‘స్కంధ’ సినిమాతో ఇటీవల రామ్ పోతినేని ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చింది కానీ, నిలబడలేకపోయింది. బోయపాటి అతికి రామ్ లాంటి హీరో నిలదొక్కుకోవడం కష్టమే అని తేల్చేశారంతా.!

ఆ సంగతి అటుంచితే, రామ్ పోతినేని ఖాతాలో మరో ప్రెస్టీజియస్ మూవీ కూడా వుంది. అదే ‘డబుల్ ఇస్మార్ట్’. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ఆల్రెడీ ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే కాన్ఫిడెన్స్‌తో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం పూరీ భారీ ప్లానింగే చేస్తున్నాడు. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీని దించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

ఆమె ఎవరో కాదు, సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయ సారా ఆలీ ఖాన్ అట. మరి జరుగుతున్న ప్రచారం నిజమే అయితే, ఈ సినిమాతోనే  సారా అలీఖాన్ తెలుగులోకి డెబ్యూ చేయబోతుంది. ‘లైగర్’ సినిమా కోసం అనన్యా పాండేని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేశాడు పూరీ. దురదృష్టవశాత్తూ ఆ సినిమా ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది.

కానీ, ‘డబుల్ ఇస్మార్ట్’ విషయంలో పూరీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయనీ తెలుస్తోంది. అవుట్ పుట్ చాలా బాగా వస్తోందట. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com