ఒమన్, లిథువేనియా మధ్య కీలక ఒప్పందం

- October 10, 2023 , by Maagulf
ఒమన్, లిథువేనియా మధ్య కీలక ఒప్పందం

మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ లిథువేనియా విదేశాంగ మంత్రి గాబ్రిలియస్ లాండ్స్‌బెర్గిస్‌తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ సమావేశమయ్యారు. మస్కట్‌లో జాయింట్ GCC-EU మినిస్టీరియల్ కౌన్సిల్ 27వ సెషన్ సందర్భంగా ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ముఖ్యంగా పర్యాటకం, ఆర్థిక సహకారం, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, పోర్ట్ లాజిస్టిక్స్ రంగాలలో సహకారం మరియు వాటిని ప్రోత్సహించే మార్గాలపై దృష్టి సారించారు. ఈ సమావేశంలో పర్యాటక రంగంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశారు.లిథువేనియా విదేశాంగ మంత్రి గాబ్రిలియస్ లాండ్స్‌బెర్గిస్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య పర్యాటక రంగంలో సహకారాన్ని ప్రోత్సహించడం,రెండు దేశాలను కలుపుతూ ప్రత్యక్ష విమానయాన సంస్థను నిర్వహించే సామర్థ్యాన్ని చర్చించడం ఎంఓయు లక్ష్యమన్నారు. ఈ చర్య రెండు దేశాల మధ్య పర్యాటకులు మరియు వ్యాపారవేత్తల ప్రవాహం ద్వారా సహకారాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com