ఎన్నారై తెలుగుదేశం గల్ఫ్ మరియు జనసేన గల్ఫ్ వారి జూం సమావేశం

- October 10, 2023 , by Maagulf
ఎన్నారై తెలుగుదేశం గల్ఫ్ మరియు జనసేన గల్ఫ్ వారి  జూం సమావేశం

గల్ఫ్ లో ఎన్నారై టిడిపి కార్యవర్గాలు గతసంవత్సరం ఏర్పడి పార్టీతో అనుసందానమై గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ ఆధ్వర్యములో విస్తృతంగా పనిచేస్తున్నాయి. అలాగే జనసేన పార్టీ కోసం గల్ఫ్ లో గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులతో పదిరోజులక్రితం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గల్ఫ్ కార్యవర్గాన్ని నియమించారు.

చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయనకు సంఘీభావం తెయచేస్తూ పవన్ కల్యాణ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం మరియు జనసేన పొత్తును ప్రకటించారు. జనసేన మరియు తెలుగుదేశం కలిసి పనిచేయాలని, ఉమ్మడి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. 

ఈ పిలుపుకు అనుగుణంగా గల్ఫ్ లోని తెలుగుదేశం శ్రేణులు మరియు జనసైనికులు కూడా కలిసి పనిచేయాలని ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఎన్నారై తెలుగుదేశం గల్ఫ్ నాయకులు మరియు జనసేన గల్ఫ్ నాయకులతో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వివిద గల్ఫ్ దేశాల ఎన్నారై తెలుగుదేశం ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్స్  సుధాకర్ కుదరవల్లి  , తులసి కుమార్, , కౌన్సిల్ మెంబర్స్ వెంకట్ కోడూరి ,హరిబాబు తక్కిలపాటి , హరిబాబు నల్లి ,ఖాదర్  బాషా, సత్య మలిరెడ్డి అధ్యక్షులు ఖాలిద్ సైఫుల్లా , విశ్వేశ్వర రావు , నాగేంద్ర బాబు  ,ఈశ్వర్ నాయుడు ,రఘునాథ్ బాబు , మొహమ్మద్ ఇమాం , రమణ మరియు జనసేన  గల్ఫ్ జాతీయ కన్వీనర్స్ త్రిమూర్తులు కేసరి ,రాందాస్ , శ్రీకాంత్ ,రామచంద్ర  నాయక్ ,చంద్ర శేఖర్ , వివిద దేశాల ప్రాంతీయ కన్వీనర్స్  భాస్కర్ రావు ,నగేష్  ,మూర్తి , అంజన  కుమార్ ,సూర్యనారాయణ  రాజేష్  లింగయ్య  ,రాయుడు  ,భరత్, నాని అడ్డాల,వీరమహిళలు పాల్గొని ఒకరికొకరు పరిచయం చేసుకుని క్లుప్తంగా ప్రసంగించారు. 

అందరూ ముక్తకంటంతో మనమంతా కలిసి మెలిసి పనిచేసి 2024లో తెలుగుదేశం మరియు జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో తేవాలని అన్నారు. జనసేన గల్ఫ్ జాతీయ కన్వీనర్స్ త్రిమూర్తులు , రాందాస్ ఈ జూం కాల్ ని ఏర్పాటు చేదిన రాధాకృష్ణ కి  పాల్గొన్న అందరికి ధన్యవాదాలు తెలియచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com