వెపన్స్ డిపాజిట్ చేయాలి లేకుంటే చర్యలు తప్పవు : సీపీ సీవీ ఆనంద్
- October 10, 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా వెపన్స్ డిపాజిట్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అక్టోబర్ 16 లోపు పోలీస్ స్టేషన్లలో వెపన్స్ సబిమిట్ చేయాలని ఆదేశించారు. వెపన్ సబ్ మిట్ చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 10 తర్వాత సబ్ మిట్ చేసిన వెపన్స్ తీసుకోవచ్చన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.
ఒకే విడతలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 10 నామినేషన్లకు చవరి తేదీ. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 15న నామినేషన్ల ఉపసంహరణకు చవరి తేదీ.
నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల చేయనున్నారు. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- బహ్రెయిన్-యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!