యూఏఈ లో స్వల్ప భూకంపం
- October 11, 2023
యూఏఈ: జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్‌సిఎం) ప్రకారం.. బుధవారం యూఏఈలోని దిబ్బా ప్రాంతంలో 1.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫుజైరాలో ఉదయం 6.18 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో స్వల్ప భూకంపం నమోదైందని అధికార యంత్రాంగం పేర్కొంది. చాలా మంది నివాసితులు భూకంప ప్రకంపనలను అనుభవించినట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కాగా, యూఏఈ నివాసితులు భూకంపాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్పారు. యూఏఈ తక్కువ నుండి మోస్తరు భూకంపాలను కలిగి ఉందని, క్రియాశీల భూకంప బెల్ట్‌లో లేమని NCM సిస్మోలజీ విభాగం డైరెక్టర్ ఖలీఫా అల్ ఎబ్రీ తెలిపారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









