ఫిలిప్పీన్స్‌లో సౌదీ దంపతులపై కాల్పులు.. భర్త మృతి
- October 12, 2023
మనీలా: ఫిలిప్పీన్స్‌లోని షరీఫ్ అగ్వాక్ నగరంలో మంగళవారం జరిగిన ఆకస్మిక దాడిలో సౌదీ పౌరుడు మరణించాడు. అతని భార్య తీవ్రంగా గాయపడింది. ఇద్దరు ముష్కరులు మోటార్‌బైక్‌పై వచ్చి సౌదీ జాతీయుడైన సులైమాన్ జమాల్‌పై కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. మాగ్విండనావో డెల్ సుర్ ప్రావిన్స్ రాజధాని షరీఫ్ అగువాక్‌లో రద్దీగా ఉండే రహదారిలోముష్కరులు దాడి చేసి పారిపోయారు. తెల్లటి ఫోర్డ్ పికప్ ట్రక్కులో సులైమాన్ జమాల్ దంపతులు వెళుతుండగా ఈ దాడి జరిగింది. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో షరీఫ్ అగ్వాక్ మేయర్ దాతు అక్మద్ మిత్రా అంపటువాన్ ఆకస్మిక దాడిని ఖండించారు. నేరస్థులను గుర్తించి, అరెస్టు చేసి, విచారించాలని పోలీసులను ఆదేశించారు. టౌన్ పోలీస్ చీఫ్ మేజర్ హరోన్ మకాబాండింగ్ మాట్లాడుతూ.. హతమైన విదేశీయుడిని సౌదీ సోలైమాన్ జమాల్ (50), గాయపడిన అతని భార్య బైనోట్ జమాల్ (45)గా గుర్తించినట్లు తెలిపారు. వీరిద్దరూ డాటు పియాంగ్, మగుయిందనావో డెల్ సుర్ నివాసితులని పేర్కొన్నారు. దాడికి గల కారణాలు మరియు నేరస్థుల గుర్తింపు తెలియరాలేదని మకాబాండింగ్ చెప్పారు. దుండగుల గురించిన సమాచారం తెలిపేవారికి రివార్డును ప్రకటించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..