54 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లు నియమించిన బిఆర్ఎస్

- October 14, 2023 , by Maagulf
54 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లు నియమించిన బిఆర్ఎస్

హైదరాబాద్: తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడం తో అధికార పార్టీ బిఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన చేసి ప్రచారం మొదలుపెట్టగా..తాజాగా 54 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలుంటే.. మొత్తం 54 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీరిని నియమించారు. కాగా, ఈ ఇన్‌చార్జిలలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు.

అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జిలు వీరే..

1.బెల్లంప‌ల్లి – ఎంపీ వెంక‌టేశ్ నేత‌
2.మంచిర్యాల – ఎమ్మెల్సీ భానుప్రసాద్
3.ఖానాపూర్ – ఎమ్మెల్సీ దండె విఠ‌ల్
4.బోథ్ – మాజీ ఎంపీ న‌గేశ్
5.ముదోల్ – మాజీ ఎమ్మెల్సీ పురాణం స‌తీశ్ కుమార్
6.బోధ‌న్ – ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌
7.ఎల్లారెడ్డి – మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధ‌ర్ గౌడ్
8.కామారెడ్డి – ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మంత్రి కేటీఆర్
9.నిజామాబాద్ అర్బన్ – ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌
10.జ‌గిత్యాల – ఎమ్మెల్సీ ర‌మ‌ణ‌, మాజీ మంత్రి రాజేశం గౌడ్
11.రామ‌గుండం – మాజీ ఎమ్మెల్సీ నార‌దాసు ల‌క్ష్మణ్‌
12.మంథ‌ని – ఈద శంక‌ర్ రెడ్డి
13.పెద్దప‌ల్లి – ర‌వీంద‌ర్ సింగ్
14.చొప్పదండి – మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్
15.వేముల‌వాడ – మాజీ ఎంపీ వినోద్ కుమార్
16.మాన‌కొండూరు – సుడా చైర్మన్ జీవీ రామ‌కృష్ణ‌
17.మెద‌క్ – కే తిరుప‌తి రెడ్డి
18.ఆందోల్ – మాజీ ఎమ్మెల్సీ ఫ‌రూఖ్ హుస్సేన్
19.న‌ర్సాపూర్ – ఎమ్మెల్సీ వెంక‌ట‌రాం రెడ్డి
20.జ‌హీరాబాద్ – మాజీ ఎమ్మెల్సీ దేవీ ప్రసాద్
21.సంగారెడ్డి – వీ భూపాల్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్
22.దుబ్బాక – బాల‌మ‌ల్లు
23.గ‌జ్వేల్ – మంత్రి హ‌రీశ్ రావు, ఎమ్మెల్సీ యాద‌వ రెడ్డి, ప్రతాప్ రెడ్డి
24.మ‌ల్కాజ్‌గిరి – ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
25.ఉప్పల్ – రావుల శ్రీధ‌ర్ రెడ్డి
26.ఇబ్రహీంప‌ట్నం – మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణా రెడ్డి
27.చేవెళ్ల – ఎంపీ రంజిత్ రెడ్డి
28.వికారాబాద్ – ఎంపీ రంజిత్ రెడ్డి
29.ముషీరాబాద్ – ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాక‌ర్
30.అంబ‌ర్‌పేట్ – క‌ట్టెల శ్రీనివాస్ యాద‌వ్, అడ్వకేట్ మోహ‌న్ రావు
31.సికింద్రాబాద్ కంటోన్మెంట్ – మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్
32.మ‌క్తల్ – ఆంజ‌నేయులు గౌడ్
33.గ‌ద్వాల్ – మాజీ చైర్మన్ రాకేశ్ చిరుమ‌ళ్ల‌
34.అలంపూర్ – ఎమ్మెల్సీ చ‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి
35.అచ్చంపేట – ఇంతియాజ్ ఇషాక్
36.క‌ల్వకుర్తి – గోలి శ్రీనివాస్ రెడ్డి
37.కొల్లాపూర్ – ఎంపీ రాములు
38.నాగార్జున సాగ‌ర్ – ఎమ్మెల్సీ కోటి రెడ్డి, రామ‌చంద్ర నాయ‌క్
39.హుజుర్ న‌గ‌ర్ – విజ‌య‌సింహా రెడ్డి
40.కోదాడ – ఎమ్మెల్సీ టీ ర‌వీంద‌ర్ రావు
41.న‌ల్లగొండ – జ‌డ్పీ చైర్మన్ బండా న‌రేంద‌ర్ రెడ్డి
42.న‌కిరేక‌ల్ – ఎంపీ బడుగుల లింగ‌య్య యాద‌వ్
43.జ‌న‌గామ – మాజీ ఎమ్మెల్సీ బీ వెంక‌టేశ్వర్లు, రాజ‌య్య, మంత్రి హ‌రీశ్‌రావు
44.మ‌హ‌బూబాబాద్ – మంత్రి స‌త్యవ‌తి రాథోడ్
45.న‌ర్సంపేట – వీ ప్రకాశ్
46.వ‌రంగ‌ల్ ఈస్ట్ – మండ‌లి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్
47.భూపాల‌ప‌ల్లి – ఎమ్మెల్సీ బ‌స‌వ‌రాజు సార‌య్య
48.ములుగు – ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి
49.ఇల్లందు – ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర
50.మ‌ధిర – మంత్రి పువ్వాడ అజ‌య్, కొండ‌బాల కోటేశ్వర్ రావు
51.వైరా – ఎంపీ నామా నాగేశ్వర్ రావు
52.స‌త్తుప‌ల్లి – ఎంపీ పార్థసార‌థి రెడ్డి
53.అశ్వరావుపేట – శేష‌గిరావు(ఖ‌మ్మం డీసీఎంఎస్)
54.భ‌ద్రాచ‌లం – ఎమ్మెల్సీ తాత మ‌ధు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com