బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

- October 14, 2023 , by Maagulf
బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని విమర్శించారు. దోపిడీ, అవినీతి, అహంకారం కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ లోనే ఉన్నాయని విమర్శించారు. ప్రజా సంపదను లూఠీ చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు సీఎం సీటులో కూర్చునే నైతిక హక్కు కోల్పోయారని పేర్కొన్నారు. బీఅర్ఎస్ ను శాశ్వతంగా ఫామ్ హౌస్ కు పంపాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక నుంచి డబ్బులు వస్తున్నాయని తెలిపారు. బెంగళూరు ఆర్టీ నగర్ లో ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో రూ. 42 కోట్లు బయటపడ్డాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లూఠీలే కొనసాగుతున్నాయని తెలిపారు. ఛత్తీస్ ఘడ్ లో ఆవు పేడ కుంభకోణం బయటపడిందన్నారు. ఆవు పేడను కూడా కాంగ్రెస్ పార్టీ వదలడం లేదని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ చేసింది జోడో యాత్ర కాదు ఇండియా లూఠో యాత్ర అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కరప్షన్ పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అంగడిగా మార్చేశారని తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా దొంగ పత్రాలు సృష్టించి అభివృద్ధి పనుల పేరుతో వివిధ సామాజిక వర్గాలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com