జూనియర్‌తో జత కట్టబోతున్న రాశీఖన్నా

- October 16, 2023 , by Maagulf
జూనియర్‌తో జత కట్టబోతున్న రాశీఖన్నా

అందాల రాశీ ఖన్నా స్టార్ హీరోయినే. ఎన్టీయార్ తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ, ఇప్పుడు రాశీఖన్నా కెరీర్ ఏమంత బాగా లేదు. తెలుగులో ప్రస్తుతం రాశీఖన్నాకి పెద్దగా అవకాశాలేం లేవు.

అయితే, తాజాగా ఓ జూనియర్ హీరో సినిమాలో రాశీఖన్నా నటిస్తోందట. ఆయన మరెవరో కాదు, సిద్దు జొన్నలగడ్డ. ‘డీజె టిల్లు’తో అబ్బో ఈయన తెగ పాపులర్. త్వరలోనే ‘టిల్లు స్క్వేర్’తో రాబోతున్నాడు.

అంతే కాదు, సిద్దు జొన్నలగడ్డ ఖాతాలో ప్రస్తుతం చాలా ప్రాజెక్టులే వున్నాయ్. అందులో తాజాగా ఇంకో ప్రాజెక్ట్ కూడా యాడ్ అయ్యింది. కోన వెంకట్ సోదరి స్టైలిస్ట్ అయిన నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతోన్న సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆసక్తికరంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com