బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పట్టేసిన రష్మికా మండన్నా

- October 16, 2023 , by Maagulf
బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పట్టేసిన రష్మికా మండన్నా

బాలీవుడ్‌లో రష్మిక అస్సలు తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే ‘యానిమల్’ సినిమాలో నటిస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో మేల్ లీడ్ పోషిస్తున్నాడు. కాగా, ప్రమోషన్లలో భాగంగా తాజాగా ‘అమ్మాయి..’ అంటూ సాగే సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ సాంగ్‌లో రష్మిక, రణ్‌బీర్ లిప్ లాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అదలా వుంటే, రష్మిక తాజాగా మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్లు తెలుస్తోంది.

విక్కీ కౌషల్ హీరోగా రూపొందుతోన్న సినిమా అది. భారీ బడ్జెట్‌తో పీరియాడికల్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందబోతోందట.

ఈ సినిమా హిట్ అయితే, రష్మికకి బాలీవుడ్‌లో ఇక తిరుగే వుండదని చెప్పొచ్చేమో. 

అలాగే, తెలుగులోనూ రష్మిక కోసం బోలెడన్ని అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప 2’లో రష్మిక నటిస్తోంది. అలాగే ‘రెయిన్ ‌బో’ అను హీరోయిన్ సెంట్రిక్ సినిమాలోనూ రష్మిక నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com