బీపీ వున్నవాళ్లు ఈ ఆహారం తీసుకుంటున్నారా.?

- October 16, 2023 , by Maagulf
బీపీ వున్నవాళ్లు ఈ ఆహారం తీసుకుంటున్నారా.?

ప్రస్తుత పరిస్థితుల్లో బీపీ అనేది చాలా చాలా సర్వసాధారణంగా మారింది. అయితే, హైబీపీతోనే ప్రాబ్లెమ్ కానీ, నార్మల్‌ బీపీ లెవల్‌తో ఎటువంటి సమస్య వుండదు. అయినా ఒక్కసారి బీపీ ఎటాక్ అయితే, జీవితాంతం అందుకు సంబంధించిన మందులు తీసుకోవాల్సిందే.

మందులతో పాటూ, కొన్ని ఆహార పదార్ధాలను సైతం ఖచ్చితంగా తీసుకోవాల్సి వుంటుంది బీపీతో బాధపడేవారు. అందులో ముఖ్యమైనవి ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా వుండే చేపలు. మాంసంతో పోల్చితే, చేపల్లో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ.

అలాగే, ఆకుకూరల్లోనూ అధికమైన పోషకాలుంటాయ్. బీపీ వున్నవాళ్లు ప్రతీరోజూ ఏదో ఒక ఆకుకూరను తమ డైట్‌లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బీట్‌రూట్ దుంపలోనే కాదు, ఆకులూ ఆరోగ్యమే సుమా.

ముఖ్యంగా బీపీ వున్న వాళ్లు బీట్ రూట్ ఆకుల్ని తింటే కావల్సిన పొటాషియం అందుతుంది. బీట్ రూట్ ఆకుల్ని కూరలా.. సలాడ్‌లా జ్యూస్‌లా చేసుకుని తీసుకోవచ్చు.

డ్రై ఫ్రూట్స్‌లో పిస్తా పప్పు బీపీ పేషెంట్లకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పొటాషియం, కాల్షియంతో పాటూ, బీపీని కంట్రోల్‌లో వుంచే గుణం పిస్తా పప్పుకుందట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com