గాజా ఆసుపత్రిపై దాడిని ఖండించిన యూఏఈ
- October 18, 2023
యూఏఈ: గాజా స్ట్రిప్‌లోని అల్ అహ్లీ బాప్టిస్ట్ హాస్పిటల్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ఆస్పత్రిలోని వందలాది మంది ప్రజలు మరణించారు. మరణించిన వారి కుటుంబాలకు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ దాడిలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తక్షణమే శత్రుత్వాలను నిలిపివేయాలని, పౌరులు మరియు పౌర సంస్థలు లక్ష్యంగా చేసుకోకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని మంత్రిత్వ శాఖ చెప్పింది. అంతర్జాతీయ మానవతా చట్టం, పౌరులు మరియు మానవ హక్కుల రక్షణ కోసం అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాలని కోరింది. పౌరుల రక్షణ ప్రాముఖ్యతను గుర్తించాలని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరింత ప్రాణనష్టాన్ని నివారించడానికి తక్షణ కాల్పుల విరమణకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







