రామ జన్మభూమి: విదేశీ విరాళాలు సేకరించేందుకు అనుమతి
- October 19, 2023
అయోధ్య: విదేశాల నుంచి విరాళాల సేకరణకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద హోం శాఖ ఈ అనుమతులు జారీ చేసినట్టు ట్రస్ట్ తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. న్యూఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 11 సంన్సద్ మార్గ్ బ్రాంచ్‌లోని ట్రస్ట్ అకౌంట్లలో విరాళాలు జమ చేయవచ్చని పేర్కొంది. ఈ అకౌంట్ మినహా మరే ఇతర బ్రాంచీల్లోనూ విదేశీ విరాళాలు అందించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ దేశంలో నలుమూలల నుంచి వచ్చిన విరాళాలను మాత్రమే తీసుకుంది ట్రస్ట్. ఇకపై విదేశాల నుంచీ విరాళాలు సేకరించేందుకు లైన్ క్లియర్ అయింది. Foreign Contribution Regulation Act (FCRA) 2010 కింద విదేశాల్లోని ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందించేందుకు వీలవుతుంది. ఇన్నాళ్లూ అందుకు కేంద్ర హోం శాఖ దీనిపై ఆంక్షలు విధించింది. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విదేశాల నుంచి విరాళాలు సేకరించేందుకు హోం మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చినట్టు తెలిపింది.
FCRA సెక్షన్ కింద ఓ స్వచ్ఛంద సంస్థ అకౌంట్ ఓపెన్ చేస్తే తప్ప విదేశాల నుంచి విరాళాలు తీసుకోడానికి అవకాశముండదు. ఈ ఏడాది జూన్‌లో FCRA లైసెన్స్ కోసం అప్లై చేసింది ట్రస్ట్. దాదాపు 2020 నుంచి ట్రస్ట్ ఈ విరాళాలు సేకరిస్తోంది. భక్తులు, ఆసక్తి ఉన్న వాళ్ల నుంచి వీటిని తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 21-24 మధ్యలో రామ మందిరం తెరుచుకోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య ఏ రోజు అయినా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని, కచ్చితమైన తేదీని ప్రధాన మంత్రి కార్యాలయం ఇంకా తెలియజేయలేదని రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ ఉండవచ్చని తెలిపారు. ఈ భవ్య మందిరాన్ని మూడంతస్తుల్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి అవుతుందని సమాచారం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..