యూఏఈలో రోడ్డు ప్రమాదం..ఎమిరాటీ మృతి

- October 20, 2023 , by Maagulf
యూఏఈలో రోడ్డు ప్రమాదం..ఎమిరాటీ మృతి

యూఏఈ: పికప్ ట్రక్ ట్రాఫిక్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఒక ఎమిరాటి మరణించాడు. ఇందులో మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎమిరేట్‌లోని షామల్ ప్రాంతంలోని ఒక కూడలికి సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని ఒక ఉన్నత అధికారి తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్‌లోని ట్రాఫిక్, పెట్రోల్ డిపార్ట్‌మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ మహ్మద్ అల్ బహర్ ప్రకారం.. వీరిద్దరి కారు కూడలికి సమీపంలో దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద నివేదిక అందిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ను రంగంలోకి దిగింది. డ్రైవర్‌తో పాటు అతని సహచరుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎమిరాటీ మరణించాడు. డ్రైవర్ గాయపడ్డాడని, అయితే పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com