క్షమాపణ చెప్పబోనని అమెరికా అధ్యక్షుడు
- May 23, 2016
జపాన్‌పై అణుబాంబు దాడికి క్షమాపణ చెప్పబోనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అణుబాంబు దాడి జరిగిన హిరోషిమా ప్రాంతాన్ని ఒబామా త్వరలో సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జపాన్‌కు చెందిన ఓ మీడియా సంస్థకు ఒబామా ఇంటర్వ్యూ ఇచ్చారు.అణుదాడికి క్షమాపణ చెబుతారా.. అంటూ ఇంటర్వ్యూలో ఒబామాను ప్రశ్నించగా.. ఒబామా పై విధంగా సమాధానమిచ్చారు. యుద్ధ సమయంలో అప్పటి సందర్భాన్ని బట్టి నేతలు నిర్ణయం తీసుకున్నారని.. దాన్ని ఇప్పుడు తప్పుబట్టలేమని ఒబామా అన్నారు.ఈ వారంలో ఒబామా హిరోషిమాను సందర్శించనున్నారు. ఈ ప్రాంతంలో పర్యటించనున్న మొదటి అమెరికా అధ్యక్షుడు ఒబామానే. 1945 ఆగస్టు 6న రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్‌లోని హిరోషిమా ప్రాంతంలో జరిపిన అణుబాంబు దాడిలో 1,40,000 మంది చనిపోయారు. ఆ తర్వాత మూడు రోజులకు నాగసాకీ ప్రాంతంలోనూ అణుబాంబు వేయగా.. అందులో 74వేల మంది మరణించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







