పాలస్తీనియన్లకు సహాయం కోసం ఏకమైన యూఏఈ
- October 23, 2023
యూఏఈ: పాలస్తీనియన్లకు సహాయ హస్తం అందించడానికి ప్రెసిడెంట్ నుండి రాజ కుటుంబీకులు, మంత్రులు, ఉన్నతాధికారులు, రాయబారులు, నివాసితుల ఒక్కటయ్యారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ముగించాలని ఎమిరాటీలు కోరుతున్నారు. యూఏఈ నివాసితులు, పిల్లలు వారాంతంలో పాలస్తీనియన్ల కోసం సహాయక వస్తువులను ప్యాకింగ్ చేస్తూ గాజా ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నారు. మరోవైపు వివాదాన్ని, హింసను ఆపాలని యూఏఈ కోరుతుంది. యూఏఈ ప్రెసిడెంట్, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. పౌరుల జీవితాలను రక్షించడంలో సహాయపడటానికి, గాజా స్ట్రిప్ ప్రజల ప్రాణాలను రక్షించే మానవతా సహాయం కోసం పిలుపునివ్వడంతోపాటు ప్రపంచ నాయకులతో నిరంతరంగా కమ్యూనికేట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ కమీషన్, ఈజిప్ట్, జోర్డాన్ మరియు ఐక్యరాజ్యసమితి నాయకులతో షేక్ మొహమ్మద్ చర్చలు జరిపారు. కైరో శాంతి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని పాలస్తీనా ప్రజలకు మద్దతు ప్రకటించారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







