సామూహిక వివాహ వేడుకలకు హాజరైన దుబాయ్ రాయల్
- October 23, 2023
యూఏఈ: దుబాయ్‌లో జరిగిన 50 మంది యువ జంటల సామూహిక వివాహ వేడుకకు దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని యూఏఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ప్రముఖ ఎమిరాటీ వ్యాపారవేత్త, అల్ హబ్టూర్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఖలాఫ్ బిన్ అహ్మద్ అల్ హబ్టూర్ మద్దతు ఇచ్చారు. హిల్టన్ దుబాయ్ అల్ హబ్టూర్ సిటీలో జరిగిన ఈ వేడుక జరిగింది. షేక్ మన్సూర్ నూతన వధూవరులకు తన అభినందనలు, సుసంపన్నమైన జీవితం కోసం శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకలో కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖలోని సాంఘిక సంక్షేమ సహాయ అండర్ సెక్రటరీ నాజర్ ఇస్మాయిల్, ఖలాఫ్ బిన్ అహ్మద్ అల్ హబ్తూర్, రషీద్ ఖలాఫ్ అల్ హబ్తూర్, పలువురు సీనియర్ అధికారులు, నూతన వధూవరుల కుటుంబాలు, ఇతర అతిథులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







