సామూహిక వివాహ వేడుకలకు హాజరైన దుబాయ్ రాయల్

- October 23, 2023 , by Maagulf
సామూహిక వివాహ వేడుకలకు హాజరైన దుబాయ్ రాయల్

యూఏఈ: దుబాయ్‌లో జరిగిన 50 మంది యువ జంటల సామూహిక వివాహ వేడుకకు దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని యూఏఈ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ప్రముఖ ఎమిరాటీ వ్యాపారవేత్త, అల్ హబ్టూర్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఖలాఫ్ బిన్ అహ్మద్ అల్ హబ్టూర్ మద్దతు ఇచ్చారు. హిల్టన్ దుబాయ్ అల్ హబ్టూర్ సిటీలో జరిగిన ఈ వేడుక జరిగింది. షేక్ మన్సూర్ నూతన వధూవరులకు తన అభినందనలు, సుసంపన్నమైన జీవితం కోసం శుభాకాంక్షలు తెలిపారు.  వివాహ వేడుకలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖలోని సాంఘిక సంక్షేమ సహాయ అండర్ సెక్రటరీ నాజర్ ఇస్మాయిల్, ఖలాఫ్ బిన్ అహ్మద్ అల్ హబ్తూర్, రషీద్ ఖలాఫ్ అల్ హబ్తూర్, పలువురు సీనియర్ అధికారులు, నూతన వధూవరుల కుటుంబాలు,  ఇతర అతిథులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com