యూఏఈ పై తేజ్ తుఫాను ప్రభావం.. పలు ప్రాంతాల్లో వర్షాలు

- October 23, 2023 , by Maagulf
యూఏఈ పై తేజ్ తుఫాను ప్రభావం.. పలు ప్రాంతాల్లో వర్షాలు

యూఏఈ :అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను యూఏఈపై "పరోక్ష ప్రభావం" చూపుతుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. దీని ఫలితంగా క్యుములస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ వర్షాలు పడతాయిని పేర్కొంది. 'తేజ్' తుఫాను ప్రస్తుతం 165-175kmph వేగంతో వీచే కేటగిరీ 2 తుఫానుగా ఉందని ఎన్సీఎం వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో 190కిమీ వేగంతో గాలులతో కూడిన కేటగిరీ 3 తుఫానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. తాము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, పుకార్లు వ్యాప్తి చేయవద్దని ఎన్‌సిఎం నివాసితులకు విజ్ఞప్తి చేశారు. తుఫాను ఒమన్ లోని ధోఫర్ మరియు అల్ వుస్తా గవర్నరేట్‌లను తాకుతుందని తెలిపింది. అక్టోబర్ 23, 24 తేదీల్లో తుఫాన్ ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని వెల్లడించింది. తుఫాను కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఒమన్ సెలవులు ప్రకటించింది. మస్కట్‌లోని యూఏఈ ఎంబసీ స్థానిక అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా సూచనలను పాటించాలని ఒమన్‌లోని ఎమిరాటీలకు పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com