దోహా: ఘనంగా దసరా వేడుకలు జరుపుకున్న తెలంగాణ వాసులు

- October 23, 2023 , by Maagulf
దోహా: ఘనంగా దసరా వేడుకలు జరుపుకున్న తెలంగాణ వాసులు

దోహా: తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖతార్ లో మూడవ సారిగా దసరా సంబరాలు దాదాపు 500 మంది తెలంగాణ వారు ఈ కరీరకమంలో పాల్గొన్నారు.

అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ గ్రూపులుగా పిల్లలకు మరియు ఫామిలీస్ కు గేమ్స్  కండక్ట్ చేయడం జరిగింది. తెలంగాణ సంప్రదాయం ఉట్టి పడేలా డెక్కన్ దీవాన్ హైదెరాబాదీ బిర్యానీ భోజనం ఏర్పాటు చెయ్యడం జరిగింది.
టీ.డబ్ల్యూ.ఏ ఉపాధ్యక్షులు రమేష్ పిట్ల జమ్మి పూజ చేసి అందరికి జమ్మి ఆకును ఇచ్చి పుచ్చు కొని దసరా జరుపుకోడం జరిగింది. పిల్లలకు మరియు పెద్దలకు ప్రత్యేక ఆటలా పోటీలు నిర్వహించారం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇండియన్ ఎంబసీ డి.సి.ఓ.ఎం సందీప్ కుమార్ 
ఐ.సి.సి సలహా మండలి అధ్యక్షులు బాబు రాజన్,ఐ.సి.సి ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం హెబ్బాగెలు,ఐ.సి.బి.ప్.సి ఉపాధ్యక్షులు దీపక్ శెట్టి, ఐ.సి.బి.ప్ కోశాధికారి కుల్దీప్ కౌర్,  
అవుట్ రీచ్ అధ్యక్షులు అవినాష్ గైక్వాడ్, కర్ణాటక సంఘ అధ్యక్షులు మహేష్ గౌడ, 
ట్.పి.యస్ అధ్యక్షులు చెన్నమనేని తిరుపతి,ఐ.సి.బి.ప్ కార్యవర్గ సభ్యులు కుల్విందర్ సింగ్,ఐ.సి.బి.ప్ కార్యవర్గ సభ్యులు శంకర్,ఏ.పి.ఎల్ డైరెక్టర్ సయీద్ 

నూతనంగా ఎన్నికైన మన తెలుగు నాయకులను సన్మానించడం జరిగింది మరియు విజేతలకు బహుమతులు అందచేసారు.మరియు వారు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున దసరా సంబరాలు జరగడం దోహా కతర్ లో మొదటి సరి అని కొనియాడారు.
టీ డబ్ల్యూ ఏ కార్య వర్గ సభ్యులు వ్యవస్థాపక అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్ గారిని మొమెంటో తో ఘనంగా సన్మానించారు.

మరియు కతర్ లో సామజిక సేవ చేస్తున్న వారిలో ప్రతి ఏటా 3ని ఎంచుకొని సన్మానించాలని అందుకు గాను ఈ సంవత్సరం గద్దె శ్రీనివాస్, రజని మూర్తి మరియు  రాధికా సాయిని ఘనంగా సన్మానించారు.

ఈ  కార్యక్రమంలో కార్య వర్గ సభ్యులు స్రవంతి, నాగరాజు, గులాం రసూల్, స్వరాజ్ కుమార్,  షోయబ్, రమేష్ నేతాజీ, శ్వేతా, రాధికా, ప్రత్యూష పద్మ , కృష్ణ, సయెద్ బఖర్, వేణు గోపాల్  తల్హా మరియు ఇక్బాల్ పాల్గొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com