యూఏఈలో భవనం పై నుంచి పడి 17 ఏళ్ల యువకుడు మృతి
- October 24, 2023
యూఏఈ: దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల బాలుడు అజ్మాన్లో అతను నివసించే భవనంపై నుండి పడి మరణించాడు. సోమవారం తెల్లవారుజామున అతని మృతదేహాన్ని అజ్మాన్ పోలీసులు గుర్తించారు. మృతుడి తల్లిదండ్రులను సమాచారం అందజేసినట్లు పోలీసులు తెలిపారు.మృతుడు గ్లోబల్ ఇండియన్ స్కూల్ అజ్మాన్లో గ్రేడ్ 12 చదువుతున్నట్లు చెప్పారు. బాలుడు తన కుటుంబంతో కలిసి చర్చిలో ముందురోజు సాయంత్రం ఒక కమ్యూనిటీ ఈవెంట్లో పాల్గొన్నాడు. అతను భవనం పై నుంచి ఎలా పడి చనిపోయాడు అనేది స్పష్టంగా తెలియరాలేదు. సామాజిక కార్యకర్తల ప్రకారం.. బాలుడి మృతదేహాన్ని తిరిగి భారతదేశానికి తీసుకెళ్లాలని కుటుంబం భావిస్తోంది. బాలుడికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అతని తండ్రి వ్యాపారవేత్త కాగా.. అతని తల్లి దుబాయ్లో నర్సుగా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









