రవి పనస నిర్మాతగా తొలి సినిమా షూటింగ్ ప్రారంభం

- October 24, 2023 , by Maagulf
రవి పనస నిర్మాతగా తొలి సినిమా షూటింగ్ ప్రారంభం

హైదరాబాద్: ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా షూటింగ్ ప్రారంభం.

తిరువీర్, ఫరియా అబ్దుల్లా, కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా నిర్మితమవుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త రవి పనస నిర్మాత. ఈ చిత్రంతో గోపి.జి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25వ తేదీ నుండి మొదలవనుంది. అత్యున్నత సాంకేతికి విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు తెరపై ఈ సినిమా ఒక గొప్ప ప్రయత్నంగా పేరు తెచ్చుకుంటుందని, ఆడియెన్స్ కు సరికొత్త  సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు.ఈ సినిమాకి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

నటీనటులు-తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషి, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ - రాజ్ తోట
మ్యూజిక్ -  కె.పి
ప్రొడక్షన్ డిజైనర్ - గాంధీ
ఎడిటర్ - ప్రవీణ్ పూడి
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
సమర్పణ - ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ 
బ్యానర్ - రవి పనస ఫిలిం కార్పొరేషన్
నిర్మాత - రవి పనస
రచన, దర్శకత్వం - గోపి.జి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com