రవి పనస నిర్మాతగా తొలి సినిమా షూటింగ్ ప్రారంభం
- October 24, 2023
హైదరాబాద్: ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా షూటింగ్ ప్రారంభం.
తిరువీర్, ఫరియా అబ్దుల్లా, కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా నిర్మితమవుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త రవి పనస నిర్మాత. ఈ చిత్రంతో గోపి.జి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25వ తేదీ నుండి మొదలవనుంది. అత్యున్నత సాంకేతికి విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు తెరపై ఈ సినిమా ఒక గొప్ప ప్రయత్నంగా పేరు తెచ్చుకుంటుందని, ఆడియెన్స్ కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు.ఈ సినిమాకి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

నటీనటులు-తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషి, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ - రాజ్ తోట
మ్యూజిక్ - కె.పి
ప్రొడక్షన్ డిజైనర్ - గాంధీ
ఎడిటర్ - ప్రవీణ్ పూడి
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
సమర్పణ - ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్
బ్యానర్ - రవి పనస ఫిలిం కార్పొరేషన్
నిర్మాత - రవి పనస
రచన, దర్శకత్వం - గోపి.జి
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







