'సిందూరపువ్వు' సినిమా దర్శకుడు మృతి ..
- May 23, 2016
కర్నూలు జిల్లా డోన్ మండలంలోని ఓబులాపురం గ్రామ సమీపంలో ఆదివారం జాతీయ రహదారిపై కారు వేగంగా వచ్చి అదుపు తప్పిన ఘటనలో తమిళ దర్శకుడు దేవరాజ్ (57) మృత్యువాతపడ్డారు. దర్శకుడు దేవరాజ్ తన మిత్రులు, బంధువుతో కలసి కోయంబత్తూరు నుంచి హైదరాబాద్కు వేగంగా వెళ్తుండగా ఓబులాపురం వద్ద కారు అదుపు తప్పింది. ఈ ఘటనలో గాయపడిన దర్శకుడు దేవరాజ్, వినాయకమూర్తి, లోగనాథన్, రాజేంద్రన్లను డోన్ ఆస్పత్రికి తరలించారు. దేవరాజ్కు గాయాలు కాకపోయినా షాక్కు గురై మృతి చెందారని పోలీసులు ధ్రువీకరించారు. కారు వేగంగా నడపడం వల్ల అదుపుతప్పి రహదారి పక్కన గుంతలో పడిపోయింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దేవరాజ్ తమిళం, తెలుగులో విజయవంతమైన 'సిందూరపువ్వు' చిత్రానికి దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







