ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఇండియా-కువైట్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్ఫెరెన్స్
- October 24, 2023
కువైట్: కువైట్‌లోని ఫోర్ సీజన్స్ హోటల్ లో జరిగిన ఇండియా-కువైట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో ITeS రంగంలోని దాదాపు 20 ప్రముఖ భారతీయ కంపెనీలు పాల్గొన్నాయి. కాన్ఫరెన్స్‌కు ఉన్నత స్థాయి కువైట్ ప్రభుత్వ అధికారులు, అగ్ర కువైట్ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు మరియు వ్యాపారవేత్తలు హాజరయ్యారు.కువైట్‌లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా, సెంట్రల్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కువైట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అమ్మర్ అల్-హుసైనీ, ఇండియా నుండి నాస్కామ్ (NASSCOM) ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా మాట్లాడుతూ.. భారత సాంకేతిక పరిశ్రమ ఆదాయం 2023 ఆర్థిక సంవత్సరంలో $245 బిలియన్లుగా అంచనా వేయబడిందని, ఐటి ఎగుమతులు $194 బిలియన్లుగా అంచనా వేయబడ్డాయని తెలిపారు. టెక్నాలజీ స్టార్ట్-అప్ల కోసం ఇండియా మూడవ అతిపెద్ద మరియు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా ఉందన్నారు. ఇండియా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్లోబల్ సవాళ్లకు స్కేలబుల్, సురక్షితమైన, సమగ్ర పరిష్కారాలను అందిస్తుందని పేర్కొన్నారు.
అంతకుముందు నాస్కామ్ ప్రతినిధులు కువైట్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సదస్సు ద్వారా ఇరు దేశాల వాటాదారులకు తమ మధ్య గొప్ప సహకారాన్ని అన్వేషించడానికి అవకాశం కల్పించింది.నాస్కామ్ , ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ (IBPC), కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ KCCI సహకారంతో భారత రాయబార కార్యాలయం ఈ సమావేశాన్ని నిర్వహించింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్‌లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









