ఒమన్ పర్యాటక రంగం నియంత్రణకు కొత్త చట్టం
- October 24, 2023
మస్కట్: పర్యాటక రంగాన్ని నిర్వహించడానికి కొత్త టూరిజం చట్టం సాధారణ ఫ్రేమ్‌వర్క్‌ను నిర్దేశిస్తుందని, ఇది వేగంగా అభివృద్ధి చెందుతోందని హెరిటేజ్, టూరిజం మంత్రి సలీం మహ్మద్ అల్ మహ్రూఖీ అన్నారు. కొత్త చట్టాన్ని నిరంతర వృద్ధికి అనుగుణంగా చట్టం పునర్నిర్మించబడిందని ఆయన తెలిపారు. టూరిజం చట్టం ఈ రంగాన్ని నిర్వహించడంలో ముందడుగు వేస్తోందని, ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే పర్యాటక రంగాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా ఈ బైలా రూపొందించబడుతుందని మంత్రి పత్రికలకు ఒక ప్రకటనలో తెలిపారు.వెల్లడించారు. ప్రపంచంలోనే ప్రముఖ సుస్థిర పర్యాటక గమ్యస్థానంగా ఒమన్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ కొత్త టూరిజం చట్టాన్ని అమలు చేయడానికి సరైన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేసారు. పర్యాటక రంగ సేవలు, ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించడానికి కొత్త చట్టం సహాయడుతుందని, అదే సమయంలో అన్ని స్థానిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలఓ మార్పులకు అనుగుణంగా ఉంటుందని మంత్రి వివరించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్‌లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









