'హమాస్ బాగా చూసుకుంది.. విడుదలైన ఇజ్రాయెలీ బందీ

- October 25, 2023 , by Maagulf
\'హమాస్ బాగా చూసుకుంది.. విడుదలైన ఇజ్రాయెలీ బందీ

యూఏఈ: అక్టోబర్ 7న గాజాలోకి తీసుకువెళ్లినప్పుడు మిలిటెంట్లు తనను కొట్టారని, అయితే పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లో ఆమె రెండు వారాల బందీగా ఉన్న సమయంలో బాగా చూసుకున్నారని హమాస్ విడుదల చేసిన ఒక వృద్ధ ఇజ్రాయెలీ బందీ తెలిపారు. 85 ఏళ్ల యోచెవ్డ్ లిఫ్షిట్జ్ ను  సోమవారం విడుదల చేసారు.ఆమెతో పాటు మరో మహిళను హమాస్ విడుదల చెసింది. ఇంకా దాదాపు 220 మంది బందీలు   హమాస్ దగ్గర ఉన్నట్లు భావిస్తున్నారు. ఆమెను మోటర్‌బైక్‌పై ఎక్కించుకుని తన కిబ్బుట్జ్ నుండి సమీపంలోని గాజాలోకి తీసుకెళ్లినట్లు చెప్పింది. తనను స్పైడర్ వెబ్‌తో పోలిన  సొరంగాల్లోకి తీసుకెళ్లారని ఆమె చెప్పింది. తనను  ఒక డాక్టర్ పరిశీలించాడని,  ఇజ్రాయెల్‌లో తీసుకుంటున్న మందులనే అందించారని లిఫ్షిట్జ్ చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ముప్పును తగినంత సీరియస్‌గా తీసుకోలేదని ఆమె అభిప్రాయబడ్డారు. గాజాలో ఇప్పటికీ బందీలుగా ఉన్న 200 మందికి పైగా బందీలలో  80 ఏళ్ల తన  భర్త కూడా ఉన్నాడని తెలిపింది. క్రీమ్ చీజ్, కరిగించిన చీజ్, దోసకాయలతో పిటాస్ ను భోజనంగా అందించారని లిఫ్షిట్జ్ చెప్పారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com