చిరంజీవి సినిమాలో విలన్ అతడేనా.?
- October 25, 2023
చిరంజీవి 156 వ సినిమాగా వశిష్ట దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. మూడు కాలాల నేపథ్యంలో ఈ సినిమా రన్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. సినిమాలో ఎక్కువ శాతం గ్రాఫిక్స్ వర్క్ వుండబోతున్నాయట.
పీరియాడికల్ ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది. హీరోయిన్‌గా అనుష్క పేరునూ, నయన తార పేరునూ పరిశీలిస్తున్నారు. ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదు హీరోయిన్ విషయంలో.
అలాగే, విలన్ పాత్ర ఈ సినిమాకి మరో మెయిన్ అస్సెట్. శక్తివంతమైన విలనిజం చూపించబోతోందట ప్రతినాయకుడి పాత్ర. ఆ పాత్ర కోసం ఎవర్ని ఎంచుకోవాలా.? అన్న విషయంపై మల్లగుల్లాలు పడుతోందట చిత్రయూనిట్.
సీనియర్ నటుడు రాజశేఖర్ పేరు ప్రస్థావనకొచ్చింది మొదట్లో. కానీ, ఈ సినిమాని ప్యాన్ ఇండియా స్థాయిలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో అంటే.. ఆ స్థాయి ఇమేజ్ వున్న నటుడే కావాలి.
‘బాహుబలి’ సినిమాతో రానా దగ్గుబాటికి ఆ స్థాయి ఇమేజ్ వుంది. సో, ఆ కోణంలో రానా పేరు కూడా పరిశీలనలో వుందట. అయితే, చిరంజీవి స్థాయిని మ్యాచ్ చేయగల మరో స్టార్ హీరోని పరిశీలిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
బహుశా బాలీవుడ్ నటులు కావచ్చు.. అన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమాలో విలన్ పాత్ర గురించిన చర్చ గట్టిగానే వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







