‘గేమ్ ఛేంజర్’ హవా మొదలైపోయిందిగా.!
- October 25, 2023
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయన నుంచి వచ్చే తదుపరి సినిమాలన్నింటికీ అదే తరహాలో ఎక్స్పెక్టేషన్స్ వుండడం సహజమే. రామ్ చరణ్ తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఎప్పుడో పూర్తి కావల్సిన ఈ సినిమాని ‘ఇండియన్ 2’ కారణంగా కాస్త వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ని సిద్ధం చేశారు శంకర్ అండ్ టీమ్.
ఫస్ట్ సింగిల్ సాంగ్ అది. ‘జరగండి జరగండి..’ అంటూ సాగే ఈ సాంగ్ గురించిన చర్చ ఇప్పుడు ఇండస్ర్టీలో హాట్ టాపిక్ అయ్యింది. అందుకు కారణం ఆ సాంగ్ కోసం ఖర్చు పెట్టిన బడ్జెట్టే అని చెప్పాలి.
దాదాపు 16 కోట్లతో ప్రత్యేకమైన సెట్ వేశారట ఈ పాట కోసం. శంకర్ సినిమాల్లో పాటలంటే ఆ మాత్రం వుండాల్సిందే మరి. అంత ఖర్చు చేసినా.. అది సెట్‌లా అస్సలు కనిపించదట. చాలా నేచురల్ ఆంబియన్స్ వుండబోతోందట ఈ పాటకి.
కైరా అద్వానీ, రామ్ చరణ్‌కి జోడీగా నటిస్తోంది ఈ సినిమాలో. రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌లో చరణ్ కనిపించబోతున్నారు ఈ సినిమాలో. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం పొలిటీషియన్‌గా చరణ్ కనిపించబోతున్నారని ఆల్రెడీ లీకుల ద్వారా అర్ధమైపోయింది. ఇక, ఇప్పుడు అధికారికంగా సినిమా నుంచి అప్డేట్స్ రావడం స్టార్ట్ అయ్యాయ్. ఇక, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ద్వారా ఎలాంటి ‘గేమ్ ఛేంజింగ్’ స్కిల్స్ చూపించబోతున్నారో లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







