భగవంత్ కేసరికి కొత్త గ్లామర్ యాడ్.!

- October 25, 2023 , by Maagulf
భగవంత్ కేసరికి కొత్త గ్లామర్ యాడ్.!

‘భగవంత్ కేసరి’ దసరా బరిలో రిలీజై రికార్డులు అని చెప్పలేం కానీ, సెలవుల్ని ఓ మోస్తరుగా యూజ్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కలెక్షన్లు మరీ జోరని అనలేం కానీ, ఓ మాదిరి కలెక్షన్లతో హుషారు చూపిస్తోంది.

ఇదే హుషారులో ఈ సినిమాకి ఓ సరికొత్త గ్లామర్ యాడ్ చేయబోతున్నారు. ఈ రోజు నుంచి అనగా బుధవారం నుంచీ ఈ సినిమాలో అదనంగా ఓ పాటను యాడ్ చేస్తున్నారు. బాలయ్య సూపర్ హిట్ సాంగ్స్‌లో ఒకటైన ‘దంచవే మేనత్త కూతురా..’ సాంగ్‌ని ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు.

అయితే, సినిమా మొదట్లోనే ఈ పాటను విడుదల చేయకుండా కాస్త గోప్యం వహించారు. ఈ రోజు నుంచీ ఈ పాట ధియేటర్లలో రన్ అవుతుంది. మాస్ జనాల్ని అప్పట్లోనే ఫుల్ హుషారెత్తించిన ఈ పాట ఎవ్వర్ గ్రీన్ అని చెప్పడం అతిశయోక్తి కాదేమో.

అలాగే ఇప్పుడు ఈ జనరేషన్‌ మెచ్చే విధంగా ఈ పాటని రీమిక్స్ చేశారు. డాన్సుల్లో అప్పటి బాలయ్యను చూడబోతున్నామని అంటున్నారు. అదెలా సాధ్యం.? అని ప్రశ్న తలెత్తినప్పటికీ, డాన్సుల్లో ఈ వయసులోనూ బాలయ్య చూపించే హుషారుకు నిజంగానే హ్యాట్సాఫ్ అనాల్సిందే.

చూడాలి మరి, ఈ రీమిక్స్ పాటకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.! కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల ఇంపార్టెంట్ ఫీమేల్ లీడ్ పోషించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com