బంగాళా దుంపతో గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవచ్చా.!
- October 25, 2023
బంగాళా దుంప (ఆలు గడ్డ)ను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఏ కాలంలోనైనా అందరూ అతిగా ఇష్టపడే కూరగాయ బంగాళా దుంప. ఈ కాయగూరను ఎంత తిన్నా ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ వుండవని నిపుణులు చెబుతున్నారు.
ఈ దుంపలో అధిక మొత్తంలో ఫైబర్ కంటెంట్ వుండడం వల్ల అది శరీరంలోని అనవసరమైన కొలెస్ర్టాల్‌ని పెరగనీయకుండా చేస్తుంది. కొలెస్ర్టాల్ లేకుంటే.. గుండె పోటు ముప్పు లేనట్లే.
హార్ట్ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రెగ్యులర్‌గా బంగాళా దుంపలు తమ ఆహారంలో తీసుకుంటే మంచిదట. అలాగే, ఈ దుంపలో అధిక ఫైబర్‌తో పాటూ, విటమిన్లు, కార్భోహైడ్రేట్లు కూడా అధికమే. అవి శరీరానికి తక్షణ శక్తినివ్వడంలో తోడ్పడతాయ్.
ఫైబర్ కంటెంట్ అధికంగా వుండడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తీరిపోతుంది. చర్మ సంరక్షణలోనూ బంగాళా దుంప చాలా హెల్ప్ చేస్తుంది. బంగాళా దుంపను రెగ్యలర్‌గా తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతూ మెరుస్తుంది. చర్మానికి నేచురల్ ట్యాక్సిన్‌లా పని చేస్తుంది.
అంతేకాదు, వుడికించిన బంగాళా దుంపతో ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. బంగాళా దుంప రసాన్ని ముఖానికి రాసుకుంటే, ముఖంపై ఏజ్ కారణంగా వచ్చే ముడతలు, పింపుల్స్ వల్ల ఏర్పడే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయ్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







