దుబాయ్: IPF వారి ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

- October 26, 2023 , by Maagulf
దుబాయ్: IPF వారి ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

దుబాయ్: దుబాయ్ లో ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ అధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు.ఈ బతుకమ్మ పండుగలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 1000 మంది మహిళలు పాల్గొన్నారు.ఈ వేడుకలు ఇతర రాష్ట్రాల వారికి, అరబ్ దేశస్థులను ఆకట్టుకున్నాయి. బతుకమ్మ విశిష్టతను వారికి అర్థమయ్యేలా నిర్వాహకులు వివరించారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం యూఏఈ అధ్యక్షులు జితేందర్ వైద్య, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ మురళి, తెలంగాణ కన్వీనర్ కుంబాల మహేందర్ రెడ్డి, కొ-కన్వీనర్ శరత్ గౌడ్, రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దీపిక, నవనీత్, అపర్ణ, కృష్ణ , మదన్, భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com