కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి
- October 26, 2023
చిక్‌బళ్లాపూర్: కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం చిక్‌బళ్లాపూర్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందినవారిగా గుర్తించారు. గోరంట్ల నుంచి కర్ణాటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కాగా, ఈ ఘటనపై స్పందించిన చిక్ బళ్లాపూర్ పోలీసు సూపరింటెండెంట్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రోడ్డుపై పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని గోరంట్ల పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. వీరి కుటుంబాలు బెంగళూరులోని హొంగసంద్రలో నివాసముంటున్నట్లు తెలిసింది. టాటా సుమోలో ప్రయాణిస్తున్న వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నాడు.ఓ చిన్నారి సహా 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు మరణించారు. వాహనంలో ఉన్న మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







