వరుణ్ తేజ్ రూటు మార్చాల్సిందే.!
- October 26, 2023
ఓ మంచి లవ్ స్టోరీతో హిట్టు కొట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి. ఇటీవల ‘గాంఢీవధారి అర్జున’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు వరుణ్ తేజ్. కానీ, ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయాడు.
గతంలో ‘అంతరిక్షం’ అనే సినిమాలో నటించి బ్యాడ్ రిజల్ట్ అందుకున్నాడు. మళ్లీ అంతరిక్ష సాహసాల నేపథ్యంలోనే ఇంకో సినిమా చేస్తున్నాడు మెగా రాకుమారుడు.
అదే ‘ఆపరేషన్ వాలైంటైన్’. శక్తి ప్రతాప్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కొత్త దర్శకుడు కాబట్టి ఖచ్చితంగా కంటెంట్ కొత్తగా వుంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ, వరుణ్‌కి ఇప్పుడు ఓ మంచి కమర్షియల్ హిట్టు పడాలి.
అలా పడాలంటే, కొత్తదనాన్ని కాస్త పక్కన పెట్టి.. రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ ఒకటి చేయాలి.. అని కొందరు వరుణ్ తేజ్‌కి సలహాలిస్తున్నారట. అయితే, వరుణ్ తేజ్ మొదటి నుంచీ తన రూటే సెపరేటు.. అనే దారిలోనే పయనిస్తుంటాడు.
కొత్త కథలను, కంటెంట్ వున్న కథలను ఎంచుకుంటూ పోతుంటాడు. హిట్టూ, ఫట్టూ అనే తేడా లేకుండా కొత్తగా ట్రై చేస్తుంటాడు. ఆ కోవకు చెందినదే తాజా సినిమా ‘ఆపరేష్ వాలైంటైన్’. మానుషీ చిల్లర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. డిశంబర్‌లో రిలీజ్ కానుంది. చూడాలి మరి, ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఎలాంటి సంచలనాలకు తెర లేపుతాడో.!
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







